ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వెంకటాపురం(కె): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ నాయకులు చిడెం మోహనరావు ఇంటి వద్ద ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి డిస్టిలేషన్‌ను రద్దు చేయాలని సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపు అసోసియేషన్‌ ఆధ్వర్యంలోయూరియాను గతంలో ఇచ్చినట్లు ఎఫ్‌ఓఎల్‌ ద్వారా డీలర్లకు అందజేయాలని వినతిప్రతం అందజేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి మండలానికి వచ్చే రహదారి గుంతలమయంగా మారడంతో మంత్రి తుమ్మల కారు పాత్రాపురం గ్రామ శివారుల్లో పంచ్చర్‌ కావటంతో మంత్రి తుమ్మల వేరే కారులో మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, కాంగ్రెస్‌ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్‌, మన్నెం సునీల్‌, సయ్యద్‌ హుస్సేన్‌, చిడెం శివ, ధనపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement