మల్హర్: ఎన్‌సీడీ, టీబీ స్క్రీనింగ్, మెడికల్ క్యాంపులు పెంచాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అన్ని ఎన్‌హెచ్‌ఎం, స్టేట్ ప్రోగ్రాం సబ్ సెంటర్ల వారీగా రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనితీరు తక్కువగా ఉన్న సబ్ సెంటర్ల పనితీరును పెంచాలని, అన్ని సబ్ సెంటర్లలో టీబీ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ పరిధిలో అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీపీఓలు శ్రీదేవి, దేవేందర్, సందీప్, నాగరాణి, డీడీఎం మధుబాబు, డీపీఓ చిరంజీవి, మండల వైద్యాధికారి వినయ్‌భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి మధుసూదన్


