పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులు వేగవంతం చేయాలి

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

గణపురం: మండలంలోని గాంధీనగర్‌ గ్రామశివా రు గుట్టలపై నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట ర్‌, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్ర మాణాలతో వేగవంతంగా భవన నిర్మాణ పనుల ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న ఈ విద్యా సంస్థ భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన విద్యను అందిస్తుందని ఆకాంక్షించారు. నాణ్యతతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement