దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

ఆర్డీఓ రవీందర్‌

మహాముత్తారం: సాదాబైనామా, భూభారతికి సంబంధించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్‌ అన్నారు. మంగళవారం ప్రొబషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డితో కలిసి మహాముత్తారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ భూభారతికి సంబంధించిన దరఖాస్తులతో పాటు చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అర్జీలు, అన్ని రకాల సర్టిఫికెట్‌ దరఖాస్తులకు త్వరితగతిన పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ భాస్కర్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

మల్హర్‌(కాటారం): కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్‌, హాజరు రిజిస్టర్లు, ల్యాబ్‌, ఫార్మసీ, ఐపీ వార్డు, ఎక్స్‌–రే గదిని తనిఖీ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వర్షాకాల సన్నద్ధత నేపథ్యంలో కాలానుగుణ వ్యా ధుల నివారణకు అవసరమైన టెస్ట్‌ కిట్లు, మందులను తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, చిన్నారులు, సాధారణ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి మౌనిక, డాక్టర్‌ హారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఆస్పత్రి

సూపరింటెండెంట్‌ పూజలు

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరత్నం మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూ పరింటెండెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు నాగరా జు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆయనకు శాలువాతో సత్కరించారు.

సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎస్‌బీఐ అందించే బీమా సౌకర్యంతో పాటు వివిధ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఉద్యోగులకు రూ.3.31కోట్ల వరకు ఉచిత బీమా రక్షణతో పాటు ప్రత్యేక బ్యాంకింగ్‌ సదుపాయాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. పర్సనల్‌ లోన్స్‌, హోమ్‌లోన్స్‌, కార్‌లోన్స్‌ తదితర రుణాలు అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయన్నారు.

ఎస్టీఓ కార్యాలయానికి

దారి కరువు

ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగా రం, మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల ఉద్యోగులు, ప్రభుత్వ ఖజానా నిధులను మంజూరు చేసే ఉప కోశాధికారాలయానికి దారి కరువైంది. కోట్లాది రూపాయల బిల్లులను మంజూరు చేసే ట్రెజరరీకి దారిలేకున్నా కష్టాలు పడుతూ కార్యాలయానికి వెళ్తున్నారు. పలు పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులు సైతం దుస్తులు తడవకుండా బురద అంటకుండా జాగ్రత్తగా కార్యాలయానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్టీఓ అధికారి ఉన్నప్పటికీ కార్యాలయం అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. వెంటనే కార్యాలయానికి సీసీ రోడ్డు నిర్మించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement