స్కూల్‌కు వెళ్లాలంటే సాహసమే..! | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌కు వెళ్లాలంటే సాహసమే..!

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

చినుకుపడితే చాలు కలెక్టర్‌ కార్యాలయ సమీపంలోని మంజూర్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్కూల్‌కు వెళ్లే దారి మొత్తం బురదమయంగా మారుతుండడంతో చిన్నారి విద్యార్థులు ప్రతి రోజూ సాహాసం చేయాల్సి వస్తోంది. చదువుకోవాలనే ఆరాటం ఒకవైపు.. ప్రమాదకరమైన దారి మరోవైపు.. ఇలా విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. అడుగడుగునా నీరు నిలిచిపోవడంతో చిన్నారులు చెప్పులు చేతిలో పట్టుకుని, బురదలో నడుచుకుంటూ పాఠశాలకు చేరాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాల ఆవరణలోనూ మోకాళ్ల లోతు వరకు నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు ఇటుకలపై అడుగులు వేస్తూ తరగతి గదులకు చేరుతున్నారు.

– భూపాలపల్లి అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement