ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

భూపాలపల్లి: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఉచిత రెసిడెన్షియల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ, ఎస్‌పీఎఫ్‌, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో సుమారు 7,112 ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అర్హత కలిగిన ఫిజికల్‌ ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ, ఉచిత వసతి, తరగతి బోధన, శారీరక శిక్షణ కల్పన పూర్తిగా ఉచితంగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వరకు తమ సమీప పోలీస్‌స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోలీసు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో శ్రమించి తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

పోలీస్‌ కావాలనుకునే వారికి

గోల్డెన్‌ చాన్స్‌

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement