కబ్జాదారులపై చర్య తీసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

కబ్జాదారులపై చర్య తీసుకోవాలి..

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

కబ్జాదారులపై చర్య తీసుకోవాలి..

చిట్యాల మండలం భావుసింగ్‌పల్లి గ్రామ సమీపంలో వ్యవసాయ భూముల్లో గతంలో ఏర్పాటు చేసిన ఎస్సారెస్పీ కాలవను పలువురు పూడ్చి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే దారులను కబ్జా చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ స్పందించి కాలువను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ భూములకు వెళ్లేదారికి ప్రారంభించాలని కోరారు. – భావుసింగ్‌పల్లి రైతులు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడం.. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో సామాన్య ప్రజలు ప్రజావాణివైపే ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తుతున్నారు. తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో వివిధ మండలాల నుంచి ప్రజలు విన్నపాలతో కలెక్టరేట్‌కు వస్తున్నారు. సోమవారం కలెక్టర్‌ 81 దరఖాస్తులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement