ఓబీసీ మహా సభను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఓబీసీ మహా సభను విజయవంతం చేయండి

Aug 3 2026 1:07 AM | Updated on Aug 3 2026 1:07 AM

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌

హన్మకొండ: బెంగళూరులో ఈనెల 7న జరగనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్‌ హరిత కాకతీయలో జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ల సాధనే లక్ష్యంగా బెంగుళూరులోని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సిటీ యూనివర్సిటీ వేదికగా అఖిల భారత జాతీయ ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాడి మల్లయ్య యాదవ్‌, బచ్చు ఆనందం, దొడ్డపల్లి రఘుపతి, తమ్మేల శోభారాణి, మాధం పద్మజాదేవి, సుశీల, తేళ్ల సుగుణ, తేళ్ల కిశోర్‌, అంబాల రవి పటేల్‌, అరేగంటి నాగరాజు, వేముల మహేందర్‌గౌడ్‌, తంగళ్లపెల్లి రమేశ్‌, దాడి రమేశ్‌ యాదవ్‌, కోలా ప్రతాప్‌ గౌడ్‌, అమరావతి సారంగపాణి, శనిగరపు సుమన్‌, చాగంటి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement