● ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ
ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి
భూపాలపల్లి అర్బన్: మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించాలని ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు నర్సింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి సంస్థ భవిష్యత్ దృష్ట్యా మణుగూరు డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి భద్రత, భావితరాలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జీఎంకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జోగు బుచ్చయ్య, రాజే ందర్, శేషారత్నం షేక్‌హుస్సెన్, చక్రపాణి, సద య్య, సంపత్, నర్సింగరావు, శంకర్ పాల్గొన్నారు.


