భూపాలపల్లి: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన షీ టీం ఎస్సై ఎండీ.ఫజల్ ఉల్లా ఖాన్, గణపురం ఏఎస్సై సమ్మిరెడ్డి, ఏఆర్ ఎస్సై ఎస్.ఉపేందర్‌ను జిల్లా పో లీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ ఘనంగా సన్మానించారు.
చెక్కు అందజేత..
ఇటీవల మృతిచెందిన మహిళా కానిస్టేబుల్ సంగీత కుటుంబానికి రూ.15 లక్షల చెక్కును శుక్రవారం ఎస్పీ సంకీర్త్ అందజేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.15 లక్షలను ఆ బ్యాంకు అధికారులతో కలిసి సంగీత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ సంగీత అకాల మరణం పోలీసు శాఖకు తీరని లోటన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ పాల్గొన్నారు.


