గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

మహాముత్తారం: మాదారం గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు పనిచేయడం లేదని, వర్షానికి గదుల్లో నీళ్లు కారుతున్నాయని, పురుపులు లేవని విద్యార్థులు సమస్యలు చెప్పారు. ఈ సందర్భంగా నాగసాగర్‌ మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలోని గదుల్లో ప్యాన్లు, ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేసి కరంటు సమస్య లేకుండా తీర్చామన్నారు. మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులకు మెనూప్రకారం భోజనం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement