వేగంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

వేగంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లావ్యాప్తంగా ఎన్నికల సంబంధిత సర్వే, డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అఽధికారి రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్నికల కార్యాలయం నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ, డిజిటలైజేషన్‌, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అఽధికారి రాహుల్‌శర్మ తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 87 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయిందని, మున్సిపాలిటీ పరిధిలో 62 శాతం పూర్తైనట్లు వెల్లడించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రేగొండ మండలంలోని 249వ పోలింగ్‌ కేంద్రంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించి, అక్కడ పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్యూమరేషన్‌ ఫారాల నమోదు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సూపర్‌వైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో సమన్వయం చేస్తూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అఽధికారి

రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement