రేగొండ: పర్యావరణ సమతుల్యతకు అడవులు చాలా కీలకమని, అడవుల ఆరోగ్యానికి పులులు సూచికలుగా నిలుస్తాయని జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చెల్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పాండవుల గుట్టల వద్ద ఫారెస్ట్ ట్రెక్కింగ్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులను పరిరక్షించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు. వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. వన్యప్రాణులను వేటాడినా, ఉచ్చుపెట్టినా కఠినశిక్షలు విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ అధికారులు అప్పలకొండ, సందీప్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు రామ్మూర్తి, లత, ఇక్బాల్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు గౌతమి, గీత, గ్రీన్ క్లబ్ నిర్వాహకులు పురుషోత్తం, సారయ్య, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు, సాజిద్ అలీ, రహీం, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్


