వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ కాకి మాధవరావు (1962 బ్యాచ్) మంగళవారం సందర్శించారు. 1971 నుంచి 1974 వరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. మాధవరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సునీత, తెలంగాణ తొలి చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్రలు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో వారిని ఈఓ భాస్కర్ శాలువాలతో సత్కరించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.వారి వెంట ప్రొఫెసర్ పాండురంగారావు, అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ సూర్య కిరణ్, స్థానిక తహసిల్దార్ గిరిబాబు ఉన్నారు.


