బెటాలియన్‌ అభివృద్ధికి సహకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌ అభివృద్ధికి సహకరిస్తాం

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

గోవిందరావుపేట: మండల పరిధిలోని 5వ బెటాలియన్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ తెలంగాణ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది ఆధునిక రెస్క్యూ పరికరాలతో నిర్వహించిన ప్రదర్శనను మంత్రి తిలకించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే పరికరాల పనితీరు, వాటి ఉపయోగాలపై అధికారులు వివరించగా మంత్రి ఆసక్తిగా వీక్షించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అభినందించారు. తదుపరి బెటాలియన్‌ సిబ్బందితో మంత్రి ఆత్మీయంగా సమావేశమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, బెటాలియన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బెటాలియన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగా కల్యాణి, అదనపు కమాండెంట్‌ సీతారాం పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement