● పలుగుల, కుంట్లం ప్రజల ఇబ్బందులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల రోడ్డుకు మూడు నెలల కిందట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రూ.22కోట్లతో శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతి లేదని రోడ్డు పనులు జరగడం లేదు. పదేళ్లుగా రోడ్డు వసతి లేక పలుగుల, కుంట్లం గ్రామాల ప్రజలు వర్షాకాలం మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఏర్పడిన గుంతలను స్థానికులు కూడ్చివేయగా.. మంగళవారం ఓ ఆటో ఆ బురదలో దిగబడింది. దీంతో ఆటోకు సెల్ఫ్ లేకపోవడంతో ఓ ఎడ్ల బండిసాయంతో బయటకు లాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలుగుల గ్రామస్తులు వేడుకుంటున్నారు.


