భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ (కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓ పీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ మంగళవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు దిల్షాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగమూర్తి, బు చ్చన్న తదితరులు యాత్ర బృందానికి ఘన స్వా గతం పలికారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్‌లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ పాల్గొని ప్రసంగించారు. సీపీఎస్ విధానంతో 22 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నా రు. ఇప్పటికే రాష్ట్రంలో 5వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పటికీ కనీస హా మీ పెన్షన్ కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లికా ర్జున్, గడ్డం వెంకటేష్, చంద్రకాంత్, మహాదేవ్, టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్, ఆర్‌యూపీపీ నాయకుడు గడ్డం లక్ష్మయ్య పాల్గొన్నారు.


