– 8లోu
● ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక చర్యలు
● ఉమ్మడి జిల్లా సమీక్షలో కలెక్టర్లు
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి..
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ తక్కువ సాగునీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ పది రోజులకు ఒకసారి రైతులతో సమావేశాలు నిర్వహించాలని, వీబీ జీరాంజీ పథకం పనుల్లో వేగం పెంచాలన్నారు. జిల్లాల్లో వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ దేవాదుల నీటి పంపింగ్‌ను సమర్థంగా నిర్వహించాలన్నారు.
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి: రహదారి ప్రమాదాల నివారణకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి వివిధ శాఖల రాష్ట్ర అధికారులతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, రహదారులు భవనాల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశాలు నిర్వహించి భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
78 శాతం డిజిటలైజేషన్ పూర్తి..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేశామని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను 78 శాతం పూర్తి చేశామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈ ఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత జలపాతం మంగళవారం ప్రకృతి సోయగాలను పంచింది. గుట్టలపై కురిసిన భారీ వర్షంతో జలపాతానికి వరద పోటెత్తింది. పాలనురగలా తెల్లని జలధారలు కనువిందు చేస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో స్నానాల కొలను మునిగిపోయింది.
– వాజేడు


