భూపాలపల్లి అర్బన్: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించలేదు. లాభాల వాటా పెంచాలని ఒకవైపు కార్మికసంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తుండగా యాజమాన్యం మాత్రం లాభాలనే ప్రకటించడం లేదు. లాభాల వాటా ప్రకటనలో ఆలస్యంపై కార్మికులు మండిపడుతున్నారు.
5,400 మంది విధులు
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో రెండు ఓపెన్ కాస్టులు, నాలుగు భూగర్భ గనుల్లో 5,400 అధికారులు, కార్మికులు పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. సింగరేణికి ప్రధాన బలం ఉద్యోగులేనని, విధుల్లో వారు చూపిస్తున్న కృషి, పట్టుదలతో సంస్థకు లాభాలు వస్తున్నాయని ప్రతిసారి యాజమాన్యం చెబుతోంది. అందుకే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా లాభాల్లో వాటా చెల్లిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు కార్మికులకు 2025–26 ఆర్ధిక సంవత్సరాలను లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదు.
కార్మికులకు వాటా..
కోలిండియాలో సంస్థ లాభాలు సాఽధిస్తే అందులో కార్మికులకు వాటా చెల్లిస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంస్థ బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లిన క్రమంలో సంస్థను లాభాల బాట పట్టించేందుకు అప్పటి గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 1999–2000 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం లాభాల వాటాతో ప్రారంభమై.. గతేడాది 32 శాతానికి చేరుకుంది. సంస్థ చరిత్రలోనే 2018–19 అత్యఽధికంగా రూ.1,766 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో కార్మికుల వాటా 28 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి సగటున రూ.లక్ష వరకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రతీ ఏడాది ఆలస్యమే..
ప్రతీ ఏడాది మాదిరిగానే అడిట్ లెక్కలు పూర్తి కాలేదనే సాకుతో సింగరేణి యాజమాన్యం లాభాల వాటా ప్రకటనలో సమాధానాలు చెబుతోంది. సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించేందుకు ప్రతి సంవత్సరం నాలుగైదు నెలల సమయం తీసుకుంటుంది. అధునాతన విధానాలను అమలు చేస్తూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు చేస్తున్న క్రమంలో ప్రతీ ఏడాది ఇదే విధంగా ఆలస్యం చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. లాభాలు ప్రకటించి యాజమన్యం కార్మికులకు ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటివరకు ప్రకటించలేదు.
గతేడాది కాంట్రాక్ట్ కార్మికులకు సైతం..
2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో నుంచి సింగరేణి యాజమాన్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున అందించింది. రెగ్యులర్ కార్మికులకు 34శాతం వాటాను చెల్లించారు. ఈ ఏడాది వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 40శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
లాభాలు
కార్మికులకు (లాభాల శాతం)
లాభాలు రూ.కోట్లలో
లాభాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం
నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న కార్మికులు
లాభాల వాటా పెంచాలని డిమాండ్
2019–20
2017–18
2023–24
2021–22
2018–19
2020–21
2022–23
2024–25


