భూపాలపల్లి అర్బన్: చెస్ క్రీడతో మేధోసంపత్తి పెంపొందించుకోవచ్చని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి పటేల్ తెలిపారు. అంతర్జాతీయ చెస్ డే సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు చెస్ ఆడి అంతర్జాతీయ చెస్ డేను జరుపుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించా రు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి పటేల్, గౌరవాధ్యక్షుడు పంతకాని సమ్మయ్య మాట్లాడారు. చెస్ క్రీడ మానసిక వికాసానికి, ఏకాగ్రత పెంపొందించడానికి, మేధోసంపత్తిని అభివృద్ధి చేయడానికి, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. అలాగే స్నేహభావం, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలు పెంపొందించే క్రీడగా చెస్‌కు స్థానం ఉందన్నారు. విద్యార్థులు, యువ త చెస్ క్రీడను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో భారీ స్థాయిలో మెగా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొనేలా టోర్నమెంట్‌ను నిర్వహించి, జిల్లాలో చెస్ క్రీడాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలి పారు. అసోసియేషన్ కమిటీ సభ్యులు అసిఫ్, రాంనారాయణ, సుమన్, దేవేందర్, శ్రీరాములు, కిరణ్, సంతోష్, శంకరయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.
చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
రవి పటేల్


