కాంగ్రెస్ సత్తా చాటాలి
భూపాలపల్లి రూరల్: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాలాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన పట్టణంలోని 30 వార్డుల ముఖ్య నేతలతో ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రజల్లో మంచితనం ఉన్నవారికే ఎన్నికల్లో అవకాశాలు ఉంటాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు మాసంపెల్లి లింగాజీ, పార్టీ నాయకులు ఆర్‌ఎన్‌ఆర్, భూపాలపల్లి మండల అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య, నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, ఆకుల మహేందర్, చల్లూరి మధు, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


