పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్‌లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సు బేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్


