శివాలయ నిర్మాణానికి విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గ్రామానికి చెందిన కాల్వ రాజారెడ్డి రూ.1,11,116 కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్‌రెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిళ్ల సత్యనారాయణరెడ్డి, మోత్కూరి నరేష్, కాల్వ సమ్మిరెడ్డి, మోత్కూరి రాజు, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం, పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలపై
చర్యలు తీసుకోవాలి
కాటారం: కాటారం మండలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భారత ఐక్య యువజన సమాఖ్య(యూవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను యూవైఎఫ్‌ఐ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కాటారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాయకుల, అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా నాయకులు దెయ్యం పోచయ్య, ఎంసీపీఐ నాయకులు రాజమణి, రమ్య, తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ఆదివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ పరీక్షకు 369 మంది విద్యార్థులకు గాను 346 మంది, టెన్త్ పరీక్షకు 197మంది విద్యార్థులకు గాను 172మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇసుక లారీలతో
ట్రాఫిక్ జామ్
ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి 163వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక లారీలు ఒకదాని వెనుకాల ఒకటి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
శివాలయ నిర్మాణానికి విరాళం
శివాలయ నిర్మాణానికి విరాళం


