హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
కాటారం: రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాఘవరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గారెపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన శాంతి, అహింసా సిద్ధాంతాలను బీజేపీ విస్మరిస్తోందన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చీటూరి మహేశ్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, నాయకులు పాల్గొన్నారు.
ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్
జంగా రాఘవరెడ్డి


