‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
ములుగు రూరల్: దండకారణ్యంలో మావోయిస్టులపై సాగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు బొమ్మెడ సాంబయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల రక్షణకు రాజ్యాంగంలో పొందుపరిచిన షెడ్యూల్‌లోని చట్టాలను ప్రధాని మోదీ, అమిత్‌షా కాలరాస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకే అమాయకపు గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న హత్యాకాండను నిలిపివేయాలని కోరారు. రేపు(8వ తేదీ)హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు చౌక్ వద్ద చేపడుతున్న ప్రజాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్ పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ నాయకులు సాంబయ్య


