భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ జామ్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఇసుక లారీ డ్రైవర్లు తప్పకుండా నిర్ధేషిత సమయంలోనే లారీలను రోడ్డుపైకి తీసుకురావాలని ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఇసుక లారీలకు జాతీయ రహదారిపై అనుమతి లేదన్నారు. హోల్డింగ్ పాయింట్స్, చెక్‌పోస్టుల్లో లారీలు నిలిపిఉంచి, సమయపాలన ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు. ఇసుక లారీల ట్రాఫిక్ నియంత్రణకు రేగొండ, కాటారంలో చెక్‌పోస్టులు, హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీసులు 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తారని, లారీడ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఎస్పీ కిరణ్ ఖరే


