రేగొండ: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కనిపర్తి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఎల్లంకి భిక్షపతి ఉద్యోగ విరమణ సభకు శ్రీపాల్‌రెడ్డి హాజరై మాట్లాడారు. అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన భిక్షపతిని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ ఎంఈఓ ప్రభాకర్, కొత్తపల్లిగోరి ఎంఈఓ రాజు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుబాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్, మండల నాయకులు పాల్గొన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి