
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
భూపాలపల్లి రూరల్: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్‌హాలులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిముల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిములకు ఫలహారాలు తినిపించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర