భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం కల్పించిన ప్లాట్ల లేఅవుట్ క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియపై ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో మంగళవారం లే అవుట్స్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యుమెంట్ రైటర్స్‌తో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25శాతం రాయితీ అవకాశం కల్పించిందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్పష్టంచేశారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31లోగా ఎస్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్‌ఆర్‌ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాల కోసం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ రాము, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టిపిఓ సునీల్, లేఅవుట్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యూమెంట్ రైటర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ