కాటారం: మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయిస్తున్న బెల్టు దుకాణాలపై ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం సంయుక్త దాడులు నిర్వహించారు. కాటారం ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంతోపాటు కనుకునూరు, సింగంపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో సుంకం చెల్లించని మద్యం(నాన్ డ్యూటీ పేయిడ్ లిక్కర్), అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లింగాచారి ఆధ్వర్యంలో దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పలు గ్రామాల్లో బెల్టు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా 9.375 లీటర్ల సుంకం చెల్లించని మద్యం, 21.96 లీటర్ల అక్రమంగా నిల్వ చేసిన మద్యం, 22.1 లీటర్ల బీర్లు గుర్తించి స్వాధీనపర్చుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్సై తెలిపారు. వీటి విలువ సుమారు రూ.34,590 ఉంటుందని, ఐదుగురిపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధి కారులు రజిత, చంద్రశేఖర్, ఎకై ్సజ్, టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, హెడ్‌కానిస్టేబుల్ రాంచందర్, శ్రీకాంత్, బాలు, హరిబాబు, వెంకట్‌రాజు, కోటేష్, శివకుమార్, రమణ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురిపై కేసు నమోదు