ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన

Mar 2 2025 2:14 AM | Updated on Mar 2 2025 2:14 AM

భూపాలపల్లి అర్బన్‌: ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల నివారణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి బ్యాంక్‌ అధికారులు జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ నారాయణబాబు ప్రారంభించారు. బ్యాంక్‌ అధికారులు, రిస్సోర్స్‌ పర్సన్స్‌ సాయిచరణ్‌,, రాకేష్‌, అనిల్‌, శ్రీకాంత్‌ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలపై వివరించారు. నేటి డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌లో కేసులను ఎలా ఫైల్‌ చేయాలి, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల పట్ల తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డిజిటల్‌ లిటరసీ అనేది చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్‌ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement