కాళేశ్వరాలయం ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరాలయం ముస్తాబు

Feb 25 2025 1:44 AM | Updated on Feb 25 2025 1:41 AM

కాళేశ్వరం: మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మదాయశాఖ అధికారులు శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వార్ల ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి (మంగళవారం) నుంచి గురువారం వరకు మూడు రోజులు పాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రత్యేక పూజలు, శివకల్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. ఉపవాస దీక్షలు, జాగరణ, ఆలయంలో ప్రత్యేక అభిషేక, అర్చన పూజలు నిర్వహించనున్నారు. శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం ముత్యాల తలంబ్రాలతో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ప్రధాన ఆలయంతో పాటు ప్రకారాలకు, గోపురాలకు రంగురంగుల విద్యుత్‌ దీపాలను ఆమర్చారు. దీంతో కాళేశ్వరాలయం జిగేల్‌మంటుంది.

దేవస్ధానం ఏర్పాట్లు..

దేవస్థానం అధికారులు క్యూలైన్‌లు, తాగునీరు, టెంట్లు, లడ్డు, ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఆలయాన్నీ విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శివకల్యాణానికి గతంలో మాదిరి కాకుండా ఉత్తరం వైపున కల్యాణ మండపంలో ఈసారి ప్రథమంగా కల్యాణం నిర్వహిస్తారు. 12 క్వింటాళ్ల లడ్డు.. సుమారుగా 60వేల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈసారి శివరాత్రి రోజున సాయంత్రం త్రివేణి సంగమంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

వివిధ శాఖలు ఇలా..

పంచాయతీశాఖ ఆధ్వర్యంలో గోదావరి వద్ద రోడ్లన్నీ శుభ్రంచేశారు. బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో పార్కింగ్‌ స్థలాలు ఏర్పా టు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా నీటిసరఫరా చేస్తున్నారు. ప్రధాన, వీఐపీ ఘాటుల వద్ద నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. వీఐపీ, సాధారణ ఘాటు వద్ద సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో గోదావరి, వీఐపీ పుష్కర ఘాటు వద్ద జల్లు స్నానాలకు మూడు పైపులైన్‌లతో ఏర్పాటు చేశారు. రెండు మహిళలు దుస్తులు మార్చుగదులు ఏర్పాటు చేశారు. 400మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తును పర్యవేక్షిస్తారు.

కిక్కిరిసిన భక్తులు

కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు బారులుదీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్‌లలో కిక్కిరిశారు. అనంతరం స్వామివారి గుర్భగుడిలో పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో జాతర ఏర్పాట్లు చేశాం. సుమారు లక్షవరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. 50వేల నుంచి 60వేల లడ్డు, పులిహోర ప్రసాదం తయారు చేస్తున్నాం. కల్యాణం వీక్షణకు ఎల్‌ఈడీ తెర, శివరాత్రికి గోదావరి హారతి ఏర్పాటు చేస్తున్నాం. లింగోద్భవపూజ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.

– శనిగెల మహేశ్‌, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం

శివుని దర్శనంతో ఎంతో ముక్తి

మహాశివరాత్రి రోజు గోదావరి స్నానాలు చేసి శివుడిని దర్శించుకుంటే ముక్తిని పొందుతారు. స్వామివారి గర్భగుడిలో అభిషేకంతో పాటు అర్చన పూజలు చేస్తారు. లింగోద్భవపూజ సమయంలో స్పర్శ దర్శనంతో భక్తులు దోషాలు, పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి.

– పనకంటి ఫణీంద్రశర్మ,

ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం

నేటినుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రానున్న భక్తులు

ఏర్పాట్లు పూర్తిచేసిన

అధికార యంత్రాంగం

కాళేశ్వరాలయం ముస్తాబు1
1/3

కాళేశ్వరాలయం ముస్తాబు

కాళేశ్వరాలయం ముస్తాబు2
2/3

కాళేశ్వరాలయం ముస్తాబు

కాళేశ్వరాలయం ముస్తాబు3
3/3

కాళేశ్వరాలయం ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement