పలిమెల: మిషన్లు, ట్రై సైకిళ్లతో..
మహాముత్తారం: మహిళలు ఆర్థికంగా ఎదగాలని సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మంజుల అన్నారు. సివిక్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సీఆర్‌పీఎఫ్ 58వ బెటాలియన్ బీ కంపెనీ ఆధ్వర్యంలో గొత్తికోయ యువకులకు సైకిళ్లు, మహిళలకు కుట్టుమిషన్లు, యువకులకు క్రీడాసామగ్రితో పాటు టీషర్టులు పంపిణీ చేశారు. అనంతరం మంజుల మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కుట్టుమిషన్లు పంపిణీ చేశామన్నారు. క్రీడాకారులు క్రీడలతో పాటు ఉన్నతంగా చదివి మంచిస్థానాల్లో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహా ముత్తారం ఎస్సై సుధాకర్, కొర్లకుంట, మహాముత్తారం, యామన్‌పల్లి, రెడ్డిపల్లి, సింగారం సర్పంచులు, సీఆర్‌పీఎఫ్ సివిల్ పోలీసులు పాల్గొన్నారు.
పలిమెలలో..
పలిమెల: మహిళలు ఆర్థికంగా ఎదగాలని సీఆర్‌పీఎఫ్ 58 బెటాలియన్ డీ కంపెనీ ఇన్‌చార్జ్ సుబ్బరాజు అన్నారు. పలిమెల పోలీస్ స్టేషన్‌లో సివిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహదేవ్‌పూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్సై అరుణ్‌లతో కలిసి కుట్టు మిషన్లు, టె సైకిళ్లు, యువతకు సైకిళ్లు, క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ చేశారు.


