● రైస్ మిల్లు వద్ద పికెట్
ఏర్పాటు చేయాలని ఫిర్యాదు
పాలకుర్తి టౌన్: మండలంలోని వావిలాల అన్నపూర్ణ రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం మాయం కాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే మాయమైన ధాన్యాన్ని ఎవరు ఎత్తుకెళ్లారో తేల్చాలని కోరుతూ పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ మంగళవారం పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిల్లు పక్కనే ఉన్న ఓపెన్ షెడ్డులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం రక్షణ లేకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆగస్టులో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలో భారీగా ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో సెప్టెంబర్ 13న పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అక్టోబర్ 6న నిర్వహించిన మరో తనిఖీలో మరికొంత ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఓపెన్ షెడ్డులో కాపలా లేకపోవడంతో మరింత ధాన్యం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


