బతుకు దెరువు కోసం వచ్చి.. | - | Sakshi
Sakshi News home page

బతుకు దెరువు కోసం వచ్చి..

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

● రిజర్వాయర్‌లో పడి తమిళనాడు వాసి మృతి

లింగాలఘణపురం : బతుకుదెరువు కోసం బాతు పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగించే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు సోమవారం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్‌లో పడి మృతిచెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ బాబు కథనం ప్రకారం.. తమిళనాడులోని కాంచీపురం తాలుకా సిరుకవేరిపక్కం గ్రామానికి చెందిన కావడి నవీన్‌ (28) ఇటీవల 4వేల బాతు పిల్లలు తీసుకొని తన తమ్ముడు నర్సింహులుతో కలిసి నవాబుపేట రిజర్వాయర్‌ సమీపంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఈక్రమంలో నవీన్‌ రెండు వేల బాతు పిల్లలను తీసుకొని రిజర్వాయర్‌ సమీపంలోకి ఒక్కడే వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి, ఫిట్స్‌ వచ్చి ఉంటుందన్నారు. రాత్రి అయినా నవీన్‌ ఇంటికి రాకపోవడంతో అతడి కోసం నర్సింహులు వెతకగా చెప్పకుండా ఊరికి వెళ్లి ఉండవచ్చని భావించాడు. మంగళవారం తెల్లవారు జామున రిజర్వాయర్‌లో శవం తేలడంతో బోరున విలపిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ బాబు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement