న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
● అధికారుల తప్పిదంతో రెండేళ్లుగా 11 మంది పింఛన్‌దారుల ఇబ్బందులు
జనగామ: జిల్లాల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం భారీగా తరలిరావడంతో కొనుగోళ్లు, నిల్వలు, రవాణా సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారం రోజులుగా మద్దతు ధరకు అటూఇటుగా ధరలు పలుకుతుండటంతో జిల్లా నలుమూలల నుంచి రైతులు ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయించేందుకు వస్తున్నారు. అయి తే, నాలుగు రోజుల ధరలతో పోలిస్తే మంగళవా రం ధాన్యం ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,200 పలికిన ధర ప్రస్తుతం రూ.1,910కు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లపై ప్రతిష్టంభన
మార్కెట్‌లోని మూడు కవర్ షెడ్లు, కల్లాలు, కాటన్ యార్డు ధాన్యం రాశులు, బస్తాలతో పూర్తిగా నిండిపోయాయి. ట్రాక్టర్లు సైతం ముందుకు, వెనక్కి కదలలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం లిఫ్టింగ్ పూర్తయ్యే వరకు ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేయాలని వ్యాపారులు కోరినట్లు తెలిసింది. అయినప్పటికీ మంగళవారం మార్కెట్‌లో ఉన్న ధాన్యానికి బిడ్డింగ్ వేయడంతో వ్యాపారులు కొనుగోళ్లు చేయబోమని భీష్మించారు. దీంతో సంబంధిత అధికారులు మార్కెట్‌కు చేరుకుని వ్యాపారులతో చర్చించి కొనుగోళ్లను ప్రారంభింపజేశారు. సీఐ సత్యనారాయణరెడ్డి కూడా మార్కెట్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ధరలు, కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో ఎదురవుతున్న సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు రాత్రి వరకు మార్కెట్‌లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
వాన భయం.. ధరలపై ఆందోళన
తుపాను ప్రభావంతో ఈదురుగాలులు వీచడం, ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో రైతులు, వ్యాపారుల్లో ఆందోళన పెరిగింది. ధాన్యం భారీగా రావడం, లారీల కొరత కారణంగా కొనుగోలు చేసిన సరుకు తరలింపు ఆలస్యమవుతోంది. వర్షం కురిస్తే ధాన్యం తడిసి నష్టపోతే ఎవరు భరించాలనే ఆందోళనతో వ్యాపారులు తక్కువ ధరలకు బిడ్డింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
ధరల వివరాలివి..
మార్కెట్‌లో ఐఆర్–64 దొడ్డు రకం ధాన్యాన్ని 25 మంది రైతుల వద్ద 10,157 క్వింటాళ్లు (16,550 బస్తాలు) కొనుగోలు చేశారు. ఆర్‌ఎన్‌ఆర్ సన్నరకం ధాన్యాన్ని ఇద్దరు రైతుల వద్ద 123 క్వింటాళ్లు (190 బస్తాలు) కొనుగోలు చేశారు. ధరల వివరాల ప్రకారం 40 మంది రైతుల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,807 నుంచి రూ.1,891 వరకు, 77 మంది రైతుల ధాన్యానికి రూ.1,900 నుంచి రూ.1,990 వరకు ధర పలికింది. మరో 61 మంది రైతుల ధాన్యానికి రూ.2,000 నుంచి రూ.2,099 వరకు, 35 మంది రైతుల ధాన్యానికి రూ.2,100కు పైగా ధర లభించింది. మార్కెట్ అధికారులు గరిష్టం ధర రూ.2,466, కనిష్ట ధర రూ.1,807, మోడల్ ధర రూ.2,266గా చూపించారు.
ట్రాఫిక్ జామ్..
సుమారు 50 నుంచి 70 ట్రాక్టర్ల ధాన్యాన్ని సాయంత్రం ఆరు గంటలకు మార్కెట్‌లోకి అనుమతించా రు. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కొనుగోలు చేయాల్సిన సరుకు 20 వేల బస్తాలకు పైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్‌లో ధర మెరు గ్గా ఉంటుందనే ఆశతో రైతులు ఇక్కడకు వస్తున్నా రు. ఈ నేపథ్యంలో అధికారులు మార్కెట్‌లో పర్యవేక్షణలోనే ఉండి ధరల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.
నేటి నుంచి రెండు రోజుల సెలవులు
వ్యవసాయ మార్కెట్ యార్డులో అధిక మొత్తంలో ధాన్యం, ఇతర ఉత్పత్తుల నిల్వలు ఉండటం, మార్కెట్ యార్డు సామర్థ్యం 50 వేల బస్తాలకు చేరుకుని స్థలం లేకపోవడంతో ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు మార్కెట్‌కు సెలవులను ప్రకటించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే బయట నుంచి సుమారు 10 వేల బస్తాలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.
జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో కిక్కిరిసిన ధాన్యపు రాశులు, బస్తాలు
కొనుగోళ్లలో జాప్యం..
నిల్వకు స్థలం కరువు
క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 తగ్గిన ధరలు


