బచ్చన్నపేట : రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రైతు ఉత్పత్తిదారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, రైతుల హాజరయ్యారు. అనంతరం సురేంద్ర మోహన్ మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు ఉద్యానవన, పట్టు పరిశ్రమ, మత్స్య రంగాల్లోనూ అభివృద్ధికి ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఏడీఏ వసంత, సుగుణ, డీఆర్డీఓ భాస్కర్, డీవీహెచ్ఓ మురళీధర్‌రావు, డీహెచ్ఎస్ఓ నర్సయ్య, ఏఓ దివ్య, సర్పంచ్ అల్వాల నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి
కె.సురేంద్రమోహన్


