జనగామ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దానం దాఖలు చేసిన పిటిషన్‌న్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకుని ప్రజల తీర్పును గౌరవించాలని పల్లా డిమాండ్ చేశారు.


