● ఆరు మెడికల్ షాపులకు డీఎంహెచ్‌ఓ షోకాజ్ నోటీసులు
స్టేషన్‌ఘన్‌పూర్: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో డివిజ న్ కేంద్రంలోని ప్రైవేటు క్లినిక్‌లు, మెడికల్‌షాపులను గురువారం తనిఖీలు నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఔషధనియంత్రణ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మెడికల్ షాపులు, ఆప్టికల్స్, క్లినిక్‌లను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ వాణి శ్రీ మాట్లాడుతూ.. ఘన్‌పూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారు వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ లను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆరు మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు అందించామన్నారు. బస్టాండ్ సమీప క్లినిక్‌లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాజరాజేశ్వరి మెడికల్‌షాపులో నిర్వహిస్తున్న క్లినిక్‌ను, కట్ల దవాఖానాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎక్స్‌రే మిషన్‌ను మూసివేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఔష ధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ రాజ్యలక్ష్మీ, జిల్లా ఔషధ నియంత్ర అధికారి ఆలె బాలకిషన్, ఘన్‌పూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీవాణి పాల్గొన్నారు.


