సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘వికసిత్‌ గ్రామ పంచాయతీ’ | - | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘వికసిత్‌ గ్రామ పంచాయతీ’

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

● ప్రణాళిక అమలుపై సర్పంచులు,

పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

జనగామ రూరల్‌: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘వికసిత్‌ గ్రామ పంచాయతీ’ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యంగా తెలంగాణ జలసిరి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీబీజీరామ్‌జీ 125 రోజుల ఉపాధి పని గ్యారంటీ, ఎల్‌నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళిక, తెలంగాణ జలసిరి పనులపై బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట, జనగామ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్లాన్‌ తయారీ, అమలు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామీణ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, ప్రభుత్వ పాఠశాల భవనాలు..తదితర నిర్మాణాలు, మరమ్మతులు కూడా ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని వివరించారు. ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ, మిషన్‌ భగీరథ, తదితర శాఖల అధికారులు గ్రామాల అవసరాలకు అనుగుణంగా సర్పంచులతో సమన్వయం చేసుకొని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. డీఆర్‌డీఓ భాస్కర్‌, అదనపు డీఆర్‌డీఓ సూరి, ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీపీఓ వెంకట్‌ రెడ్డి, మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్‌, డీవీహెచ్‌ఓ మురళీధర్‌ రావు, ఈఈ పీఆర్‌ రవీందర్‌, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్‌, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల

ఎగుమతులను ప్రోత్సహించాలి

ప్రాసెస్డ్‌ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించి ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సేంద్రీయ రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ.. జిల్లాలో ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, చిట్టి ముత్యాలు బియ్యం ఎగుమతులకు అధిక డిమాండ్‌ ఉందన్నారు. ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలు, నాణ్య త ప్రమాణాలు, మార్కెటింగ్‌, సహాయం, ఎగుమతి ప్రక్రియపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వా రా అసిస్టెంట్‌ మేనేజర్‌ సుకేష్‌ వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధి కారి నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్‌, నాబార్డ్‌ డీడీఎం విజయ్‌, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ ప్రతిభ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement