జనగామ రూరల్: పీఎం–డీడీకేవై (ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన) పథకం 2025–2031 వరకు అమలయ్యే కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, సంబంధిత శాఖల అధికారులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సమన్వయంతో అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీఎం డీడీకేవై పథకం కింద పోర్టల్‌లో డేటా నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, డీవీహెచ్‌ఓ మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, సీపీఓ చినకోట్యా నాయక్, ఎల్డీఎం ప్రతిభ, డీఆర్డీఓ భాస్కర్, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, డీసీఓ కరుణ పాల్గొన్నారు.
వీబీజీరామ్‌జీ పనులు వేగవంతమవ్వాలి
వీబీజీరామ్‌జీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలో అమలు చేస్తున్న పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సకాలంలో ప్రారంభించి, పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, జెడ్పీ సీఈఓ బలరామారావు, ఏపీడీ నూరుద్దీన్,డీపీఓ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


