పీపీఈటీఏ నూతన కమిటీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

పీపీఈటీఏ నూతన కమిటీ ఏర్పాటు

Aug 27 2026 1:06 AM | Updated on Aug 27 2026 1:06 AM

జనగామ: ప్రైవేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (పీపీఈటీఏ) జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు పాఠశాలల్లో శారీరక విద్యకు మరింత ప్రాధాన్యత కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

నూతన కమిటీ ఇలా..

చైర్మన్‌గా జంగిడి గుణవర్ధన్‌, అధ్యక్షుడిగా మునిగే సురేష్‌, ఉపాధ్యక్షులుగా టి.రంజిత్‌, సుధాకర్‌, ప్ర ధాన కార్యదర్శిగా బి.రమేష్‌, కోశాధికారిగా కె.మనోజ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎన్‌.సురేందర్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌గా పి.శ్రవణ్‌, స్పోక్స్‌ పర్సన్‌గా వి.వినోద్‌ కుమార్‌, అంజి, మీడియా సెక్రటరీగా ఏ.సాయిరాం ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా నరసింహ, స్వాతి, పి.రవి, జి.మధు, టి.మహేష్‌, మండల ప్రతినిధులుగా రవి, జె.సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా తిరుమలేష్‌, రాజు, సరిత, బాలస్వామి, శ్రీధర్‌, మనీషా, ప్రశాంత్‌, అశ్విని, సత్య నిరంజన్‌, చందర్‌, ప్రదీప్‌, రాజశేఖర్‌, శ్రీనివాస్‌, అజయ్‌, రణదీప్‌, హేమలతను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement