న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 202
11
10
07
05
కొత్త ఆటోలు
పాత ఆటోలు
ట్రాక్టర్లు
ప్రైవేట్
ఆటోలు
పురపాలికలో వాహనాలు,
రోజువారీ చెత్త సేకరణ సమాచారం
జనగామ: పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ మరో కీలక అడుగు వేసింది. పట్టణంలో చెత్త సేకరణకు 11 పెద్ద సైజు ఆటోలను కొత్తగా కొనుగోలు చేసింది. ఒక్కో ఆటోకు రూ.10.50 లక్షల చొప్పున వ్యయం చేసినట్లు సమాచారం. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత పటిష్టం చేస్తున్నారు.
11 కొత్త ఆటోలు
జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న వాహనాల ద్వారా రోజుకు సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వార్డుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ 11 కొత్త ఆటోలను కొనుగోలు చేసింది. కొత్త వాహనాలు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయి. వీటి నిర్వహణ కోసం తాత్కాలిక ప్రాతిపదికన మరో ఐదుగురు డ్రైవర్లను తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆటోలను ఎప్పటి నుంచి వినియోగంలోకి తీసుకురావాలనే విషయంపై చైర్‌పర్సన్, కమిషనర్ చర్చించిన అనంతరం అధికారికంగా వెల్లడించనున్నారు.
ఒక్కో ఆటోకు తగ్గిన రూ.3లక్షల వ్యయం
కొత్త వాహనాలు అందుబాటులోకి రావడంతో పాత వాహనాలకు అదనంగా వీటిని వినియోగించి వాణిజ్య ప్రాంతాలు, ముఖ్యమైన వార్డుల్లో రోజుకు రెండుసార్లు చెత్త సేకరించే అవకాశం ఉంది. చైర్‌పర్సన్, కమిషనర్ ప్రత్యేక కృషితో ఒక్కో ఆటోపై సుమారు రూ.3 లక్షల వరకు వ్యయం తగ్గింది. జనగామ స్వచ్ఛతే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలకు పట్టణ ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు.
స్వచ్ఛతపై పురపాలిక కఠిన చర్యలు..!
పట్టణాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలిక మరింత కఠినంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానాలు విధించడంతో పాటు ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్లు సమాచారం. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు రోజువారీ చెత్తను ప్రత్యేక డబ్బాల్లో వేసేలా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించాలని పురపాలిక అధికారులు కోరుతున్నారు.
మొత్తం వాహనాలు33
పురపాలికకు 11 కొత్త ఆటోలు
పట్టణంలో ఇక చెత్త కష్టాలకు చెక్
ఉదయం, సాయంత్రం సేకరణకు
సన్నాహాలు
పాత వాహనాలకు తోడు కొత్తవి
కొనుగోలు
పట్టణ పారిశుద్ధ్యంపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి
రోజు
చెత్త సేకరణ
10
టన్నులు


