ముగిసిన ‘టోసా–ఓయాసిస్‌కా’ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘టోసా–ఓయాసిస్‌కా’

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

ముగిసిన ‘టోసా–ఓయాసిస్‌కా’

హన్మకొండ అర్బన్‌: హనుమకొండలో మూడు రోజులపాటు నిర్వహించిన టోసా–ఓయాసిస్‌కాన్‌(తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌–ఆర్థోపెడిక్‌ సౌత్‌ ఇండియా కాన్ఫరెన్స్‌)–2026 ఆదివారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు పాల్గొని ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సలపై తమ అనుభవాలు పంచుకున్నారు. రోబోటిక్‌ సర్జరీ, కృత్రిమ మేధ, కీళ్ల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలపై సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్యులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. సీనియర్‌ వైద్యుడు వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయాసిస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ కె.రాంకుమార్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అల్వాల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement