పారాత్రోబాల్‌ చాంపియన్‌షిప్‌గా రాష్ట్ర మహిళల జట్టు | - | Sakshi
Sakshi News home page

పారాత్రోబాల్‌ చాంపియన్‌షిప్‌గా రాష్ట్ర మహిళల జట్టు

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు తమిళనాడు కోయంబత్తూర్‌లో జరిగిన ఐదవ సౌత్‌ జోన్‌ పారా త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో తెలంగాణ మహిళల జట్టు విజేతగా నిలువగా జట్టు కెప్టెన్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన పారాత్రోబాల్‌ క్రీడాకారిణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ మేరకు ఉత్తమ ప్రతిభతో చాంపియన్‌షిప్‌గా నిలిచి బంగారు పతకం సాధించిన తెలంగాణ మహిళల జట్టుకు, ప్రత్యేకంగా కెప్టెన్‌ మాచర్ల కృష్ణవేణికి పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు, జట్టు కోచ్‌ సింగారపు బాబు, మేనేజర్‌ తాళ్ల శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర మహిళల జట్టు కెప్టెన్‌గా రాణించిన కృష్ణవేణిని విశ్వనాథపురం గ్రామస్తులతో పాటు మండలంలోని పలువురు క్రీడాభిమానులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement