పాపన్న స్ఫూర్తితో హక్కులను సాధించుకుందాం | - | Sakshi
Sakshi News home page

పాపన్న స్ఫూర్తితో హక్కులను సాధించుకుందాం

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

పాలకుర్తి టౌన్‌ (దేవరుప్పుల): సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే గీత కార్మికుల హక్కులను సాధించుకుందామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో మాజీ సర్పంచ్‌ వంగ పద్మ వెంకటేశ్వర్లు దాతృత్వంతో సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిన్నమడూర్‌ టీసీఎస్‌ అధ్యక్షుడు ముసిగుంపుల నరేష్‌ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్యాంక్‌ బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. సమావేశంలో సుప్రజ హాస్పిటల్‌ ఎండీ విజయ్‌ కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్నే వెంకట మల్లయ్య, వి. వెంకటనరసయ్య, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, బబ్బూరి శ్రీకాంత్‌ గౌడ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పరిధిల భాస్కర్‌, మండల కార్యదర్శి ఉడుగుల ప్రభాకర్‌, సర్పంచ్‌లు జోగేశ్వర్‌, పెద్ది కృష్ణమూర్తి, ధనలక్ష్మీ, వంగ అర్జున్‌, పరశురాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

కేజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement