వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని అటవీశాఖలో శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు దేవాలయానికి చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని వారు కొనియాడారు. అలాగే ఇంగ్లండ్ దేశానికి చెందిన హోవార్డ్, రేక్ చోంగ్‌లు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ విజయ్‌కుమార్ వారికి వివరించారు.


