ఉద్యమాలకు పురుడుపోసిన గడ్డ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాలకు పురుడుపోసిన గడ్డ

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: ఉద్యమాలకు జనగామ పురుడు పోసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి సమ్మక్క సాగర్‌ వంటి ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు కాలువల నిర్మాణం, భారీ మోటార్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. జనగామ గడ్డకు ఉన్న పోరాట చరిత్రను, త్యాగాల వారసత్వాన్ని కాపాడుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement