జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ స్థాయి కోటా కింద 15 ఎంబీబీఎస్ సీట్లు దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ కానున్నాయి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో నీట్ 15 శాతం ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కింద 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులకు ఆన్‌లైన్ సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు.
నాలుగు విడతల్లో..
ఏఐక్యూ కౌన్సెలింగ్‌ను మూడు సాధారణ రౌండ్లు, ఒక ఆనన్‌లైన్‌న్ స్ట్రే వేకెన్సీ రౌండ్‌గా నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొదటి రౌండ్‌కు సంబంధించిన తాత్కాలిక సీట్ల వివరాలను ఈ నెల 4న పాల్గొనే కళాశాలలు పరిశీలించాయి. అనంతరం 5 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ 12న మధ్యాహ్నం 3 గంటల వరకు, ఫీజు చెల్లింపు సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈనెల 24 నుంచి రెండో రౌండ్, మూడో రౌండ్ సెప్టెంబర్ 10నుంచి ప్రారంభం కానుంది. మూడు రౌండ్ల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న సీట్ల మ్యాట్రిక్స్ ధ్రువీకరణ ఉంటుంది.
జిల్లాలో అందుబాటులో సీట్లు
ఏఐక్యూ కౌన్సెలింగ్ ద్వారా జనగామ మెడికల్ కళాశాలలో 15 సీట్లు దేశవ్యాప్తంగా నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు అందుబాటులోకి రాను న్నాయి. రాష్ట్ర కోటా సీట్లతో పాటు ఏఐక్యూ సీట్లకు కూడా విద్యార్థులు పోటీ పడనుండటంతో జనగా మ మెడికల్ కళాశాల జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగం కానుంది. కౌన్సెలింగ్‌లో ప్రతి దశలోనూ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, చాయిస్ ఫిల్లింగ్, ఎంపిక లాకింగ్, సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ వంటి దశలు కీలకం. నిర్ణీత గడువులో ఎంపిక లాకింగ్ చేయకపోతే విద్యార్థుల సీటు కేటాయింపు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున షెడ్యూల్‌ను జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ ఖరారు
నాలుగు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ


