● రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు రవీందర్‌నాయక్
జనగామ రూరల్: సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై శనివారం సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వాణిశ్రీ, జిల్లా స్థాయి అధికారులు సిద్ధార్థ రెడ్డి, హరికృష్ణ, శ్రావ్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్
లింగాలఘణపురం: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్ జరగనుందని రాష్ట్ర సంచాలకులు రవీందర్‌నాయక్ తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ వాణిశ్రీతో కలిసి సందర్శించారు. పీహెచ్‌సీలోని వసతులతో పాటు సిబ్బంది రిజిస్టర్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.


